Teamindia: టీమిండియా తర్వాత కెప్టెన్ ఎవరు.. జట్టులోకి ఎవరికి ఛాన్స్ ఎక్కువంటే?

Teamindia: టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇటీవల ప్రకటించారు. అయితే టీమిండియా కెప్టన్‌లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అంటే రోహిత్ శర్మ పేరు మొదటి ప్లేస్‌లో ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లి ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అతను నడిపించిన తీరు ఎంతో ముఖ్యమైనది. ఎన్నో హిట్‌లు టీమిండియాకి అందించడం వల్ల రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అనే బిరుదు వచ్చింది. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బీసీసీఐ కూడా ఇప్పటి వరకు ఎవరు కెప్టెన్ అనే విషయాన్ని ప్రకటించలేదు. రోహిత్, కోహ్లీ వరుసగా రిటైర్మెంట్ ప్రకటించడంతో తర్వాత కెప్టెన్ ఎవరే ప్రశ్న చాలా మందిలో మొదలైంది. అయితే రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి గిల్‌కి పగ్గాలు చేపట్టనున్నట్లు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే దీనిపై మేనేజ్‌మెంట్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గిల్‌కి కెప్టెన్‌గా, బుమ్రాకు వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చే ఉందని ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బుమ్రా ఎక్కువగా గాయాలకు గురవుతున్నాడు. దీనివల్ల బాధ్యతలు తొలగిస్తే ఇబ్బంది అవుతుంది. ఈ కారణం వల్ల ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
గిల్, బుమ్రా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గిల్‌కి కాకుండా బుమ్రాకు బాధ్యతలు అప్పగించిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సునీల్ గవాస్కర్ వంటి సీనియర్ ప్లేయర్ల అండ బుమ్రాకు ఉంది. అయితే గిల్ నాయకత్వం బాలేదని కాకపోయినా.. బుమ్రాకు ఉన్న అనుభవం ప్రకారం బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో బుమ్రా క్రియేట్ చేసిన రికార్డుల బట్టి పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోంది. అలాగే గిల్‌కు కూడా టెస్టులలో తనని తాను నిరూపించుకోవడానికి ఓ అవకాశం ఇవ్వాలని కూడా యాజమాన్యం భావిస్తోంది. అయితే గిల్ కాకుండా బుమ్రా అయితేనే జట్టును సరిగ్గా పెడతారని భావిస్తున్నారు. శరీర సామర్థ్యం పక్కన పెడితే అన్ని విషయాల్లో కూడా నంబర్ వన్‌గా ఉంటాడు.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
ముఖ్యంగా బౌలింగ్ లో అయితే బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే జట్టులో బౌలింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆటలో కీలకమైన వికెట్లు పడగొడితేనే మ్యాచ్ గెలుస్తారు. లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్ని కీలకమైన వికెట్లు తీస్తే అంత బలం. టెస్ట్ మ్యాచ్‌లలో పరుగులు కంటే వికెట్లు చాలా ముఖ్యమైనవి. బుమ్రా బౌలింగ్‌లో టాప్. కాబట్టి బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు ఇస్తే జట్టు మెరుగ్గా ఉంటుందని బెటర్ అని యాజమాన్యం భావిస్తోంది. అప్పుడు టీమిండియా ఎన్నో విజయాలు అందుకుంటుందని అంటున్నారు. మరి టెస్ట్ మ్యాచ్‌కి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్