Boycott Turkey Apples : భారత్ దెబ్బకు కుళ్లిపోయిన రూ.800కోట్ల విలువైన టర్కీ యాపిల్స్

Boycott Turkey Apples : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపింది. దీంతో ఆగ్రహించిన భారతీయులు టర్కీ ఉత్పత్తులను.. ముఖ్యంగా యాపిల్స్‌ను బహిష్కరించడం మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. ఈ సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు డ్రోన్లు సరఫరా చేసి సహాయం చేసిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విషయం బయటకు రావడంతోనే భారత్‌లో టర్కీ ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది.
భారత్‌లోకి టర్కీ నుంచి ఎంత యాపిల్ దిగుమతి అయింది?
గత కొన్నేళ్లుగా భారత్‌లోకి టర్కీ నుంచి యాపిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2021-22లో రూ.563 కోట్లు, 2022-23లో రూ.739 కోట్లు, 2023-24లో ఏకంగా రూ.821 కోట్ల విలువైన యాపిల్స్‌ను టర్కీ భారత్‌కు ఎగుమతి చేసింది. టర్కీ నుంచి చౌకగా, రాయితీలతో దిగుమతి అవుతున్న యాపిల్స్ వల్ల భారతీయ మార్కెట్ నిండిపోయింది. ఇది దేశీయ యాపిల్ రైతుల ఆదాయం, మార్కెట్ వాటాపై తీవ్ర ప్రభావం చూపింది.
Read Also: Yamaha : కొనండి… మరచిపోండి.. 10 ఏళ్లు నో టెన్షన్.. యామహా అదిరిపోయే వారంటీ ఆఫర్!
టర్కీ యాపిల్స్ నాణ్యత, ధర కారణంగా భారత్‌లో బాగా పాపులారిటీ పొందాయి. అయితే ఇటీవల వాటిని బహిష్కరించడం పెరిగింది. దీని కారణంగా డిమాండ్ 50 శాతం వరకు పడిపోయింది. బహిష్కరణ కారణంగా వ్యాపారులు ఇప్పుడు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వాషింగ్టన్, ఇరాన్, న్యూజిలాండ్ నుంచి యాపిల్స్‌ను తెప్పిస్తున్నారు.
టర్కీకి భారీ నష్టం తప్పదు
ఈ బాయ్‌కాట్ కారణంగా టర్కీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. భారతీయ మార్కెట్లలో ఆఫ్-సీజన్‌లో కూడా టర్కీ యాపిల్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. భారతీయ యాపిల్స్ ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఆఫ్-సీజన్‌లో దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతుంది. టర్కీ యాపిల్స్ సాధారణంగా తీపిగా, రసంగా ఉండడం వల్ల వాటికి భారతీయ యాపిల్స్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న బాయ్‌కాట్ టర్కీ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తీయనుంది.
Read Also:Teamindia: టీమిండియా తర్వాత కెప్టెన్ ఎవరు.. జట్టులోకి ఎవరికి ఛాన్స్ ఎక్కువంటే?
-
Amit Shah: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో రెండో రోజు చర్చ.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ.. రాజ్ నాథ్ ఏమన్నాడంటే
-
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది.. సీడీఎస్ సంచలన ప్రకటన
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?